Yesayya O Yesayya | Christian Songs in Telugu

Yesayya O Yesayya

యేసయ్యా ఓ యేసయ్యా ఆరాధ్యుడా నా పూజ్యనీయుడా
ఆశ్చర్యకార్యముల్ చేయువాడా స్తుతియింతు మనసారా
నీవే నాకు ఆధారము నీవే నాకు ఆశ్రయము
నీవే నా… జీవం నీవే నా… సర్వం (2)

నీ నడకను నాకు నేర్పుమయా నిను వెంబడించుటకు
నీ మాటలు నాకు నేర్పుమయా నిను నే చాటుటకు
నీవే నా… జీవం నీవే నా… సర్వం (2)

ప్రార్థించుట నాకు నేర్పుమయా అదియే నాకు బలం
నీ చిత్తములో నడుపుమయా అదియే బహు క్షేమం
నీవే నా… జీవం నీవే నా… సర్వం (2)

నీ ఆత్మతో నను నింపుమయా నీవలె నను మార్చు
నీ మహిమను నాకు చూపుమయా నిను నే ఘనపరతు
స్తుతియూ.. మహిమా. ఘనతా నీకే (2)


Related Posts