thoorpu Diku Chukka Butte Merammaa O Mariyamma | Christian Songs in Telugu

thoorpu Diku Chukka Butte Merammaa O Mariyamma

తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా
పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా
పాపంబు బాపను పుట్టెనమ్మా
సత్యవంతుడమ్మా
బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు ||2||
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగ పాడెదము


Related Posts