saakshyamichcheda mana swami | Christian Songs in Telugu

saakshyamichcheda mana swami

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే
సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు
దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో
పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు
పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము
బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల
నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు
పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు
బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు
చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన
ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు
పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల
ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు
ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక
తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర


Related Posts