nee chethitho nannu pattuko | Christian Songs in Telugu

nee chethitho nannu pattuko

పల్లవి:
నీ చేతితో నన్ను పట్టుకో – నీఆత్మతో నన్ను నడుపు

శిల్పి చేతిలో సిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము (2x)

1.
అంధకార లోయలొన – సంచరించిన భయము లేదు

నీ వాక్యము శక్తిగలది – నా త్రోవకు నిత్యవెలుగు (2X)

2.
ఘోర పాపిని నేను తండ్రి – పాప యూబిలో పడియుంటిని

లేవనెత్తుము శుద్ధిచేయుము – పొందనిమ్ము నీదు ప్రేమను (2X)

3.
ఈ భువిలో రాజు నీవే – నా హృదిలో శాంతినీవే

కుమ్మరించుము నీదు ఆత్మను – జీవితాంతము సేవచేసెదన్ (2X)
…నీ చేతితో…


Related Posts