nannethagano preminchenu | Christian Songs in Telugu

nannethagano preminchenu

పల్లవి: నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను

నా యేసుడు – నా పాపము – నా శాపము

తొలగించెను – నన్ను కరుణించెను (2X) .. నన్నెంతగానో..

1. సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2X)

పడనీయక – నన్ను చెడనీయక (2X)

తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను (2X) .. నన్నెంతగానో..

2. సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2X)

నేర్పించెను – నాకు చూపించెను (2X)

వర్ణించగాలేను ఆ ప్రభువును (2X) .. నన్నెంతగానో..

3. కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2X)

నా కోసమే – తాను శ్రమ పొందెను (2X)

నా పాపమంతటిని క్షమియిం చెను (2X) .. నన్నెంతగానో..

4. ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2X)

ఏమిచ్చెదన్ – నేనేమిచ్చెదన్ (2X)

నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2X) .. నన్నెంతగానో..


Related Posts