nammi nammi manushyulanu | Christian Songs in Telugu

nammi nammi manushyulanu

నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ
పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు
ఇలా. . ఎంత కాలము. . నీవు సాగిపోదువు. .

1. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించినా
బిలాము ఏమాయెను? దైవదర్శనం కోల్పోయెను
నాయేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే

2. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను? అగ్నికి ఆహుతి ఆయెను
నాయేసయ్యను నమ్మిన యెడల
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే

3. సుఖ భోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను? రోగమును సంపాదించెను
నాయేసయ్యను నమ్మిన యెడల
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే


Related Posts