maargamu Choopumu Intiki | Christian Songs in Telugu

maargamu Choopumu Intiki

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి
పాప మమతల చేత
పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము
పశ్చాత్తాప్పమునోంది
తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము
ప్రభు నీదు సిలువ
ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము
దూర దేశములోన
బాగుండుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను
నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము
దాక్షిణ్య మూర్తి నీ
దయ నాపై కురిపించి ధన్యున్ని చేయుము
నా తండ్రి నను జూచి
పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి
ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను
నా జీవిత కథయంత
యేసు ప్రేమకు ధరలో సాక్షమై యుందును


Related Posts