kanugontini ninne o nazareya | Christian Songs in Telugu

kanugontini ninne o nazareya

కనుగొంటిని నిన్నే ఓ నజరేయా – సమర్థుడవని సహాయము చేయ..
నీ ప్రభావము – నాలోకి చేరగా – నా స్వరూపమూ – మారిపోయెగా..

1. ప్రయత్నాలు చేసి వేసారియుంటిని – ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని..
వైద్యులచుట్టూ – కాళ్లు అరిగేటట్టు – ఎంతతిరిగినా – సరికాక యుంటిని..

2. స్వంతజనులతోనే వెలివేయబడితిని – అపనిందలపాలై మతిపోయి చెడితిని..
బ్రతుకెందుకని – మనసే చంపుకుని – జీవశ్చవమై – ఇల మిగిలియుంటిని..

3. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని – స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని..
ధైర్యములేక – ఎదురుగ రాలేక – వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని..


Related Posts