deva samsthuthi cheyave mansa | Christian Songs in Telugu

deva samsthuthi cheyave mansa

దేవ సంస్తుతి చేయవే మనసా – శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి

చేయవే మనసా – దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా

దేవుని – పావన నామము స్తుతించుమా – నా యంతరంగము – లో

వసించు – నో సమస్తమా – ఆ కారణముచే ||…దేవ… ||

1. జీవమా యెహోవా నీకు – జేసినా మేళ్ళన్ మరువకు

నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు – లేవియున్

లేకుండ జేయును – ఆ కారణముచే ||…దేవ… ||

2. చావు గోతి నుండి నిన్ను – లేవనెత్తి దయను కృపను

జీవ కీరీటముగ వేయును – నీ శిరసు మీద – జీవ

కీరీటముగ వేయును – ఆ కారణముచే ||…దేవ… ||

3. యౌవనంబు పక్షిరాజు – యౌవనంబు వలెనే క్రొత్త

యౌవనంబై వెలయునట్లుగ – మేలిచ్చి నీదు – భావమును

సంతుష్టి పరచునుగా – ఆ కారణముచే ||…దేవ… ||

4. ప్రభువు నీతి పనులు చేయున్ – బాధితులకు న్యాయమిచ్చున్

విభుడు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను

విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||…దేవ… ||

5. అత్యధిక ప్రేమ స్వరూపి – యైన దీర్ఘశాంత పరుడు

నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు

నీపై నెపుడు కోపముంచడు – ఆ కారణముచే ||…దేవ… ||

6. పామరులమని ప్రత్యుపకార – ప్రతిఫలంబుల్ పంపలేదు

భూమి కన్న నాకసంబున్న – యెత్తుండు దైవ – ప్రేమ

భక్త జనులయందున – ఆ కారణముచే ||…దేవ… ||

7. పడమటికి తూర్పెంత యెడమో – పాపములకున్ మనకు

నంత యెడము కలుగ జేసి యున్నాడు – మన పాపములను

యెడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే ||…దేవ… ||

8. కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తి పరుల

యెడల జాలి – పడును దేవుండు – తన భక్తి పరుల – యెడల

జాలి పడును దేవుండు- ఆ కారణముచే ||…దేవ… ||

9. మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి

మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి – కొనుచు

కరుణ జూపుచుండును – ఆ కారణముచే ||…దేవ… ||

10. పూసి గాలి వీవ నెరిగి – పోయి బసను దెలియని వన – వాస

పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ – ప్రాయము

మన దేవకృప మెండు – ఆ కారణముచే ||…దేవ… ||

11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు

నిరతమును కృప నిలిచి యుండును – యెహోవా నీతి

తరముల పిల్లలకు నుండును – ఆ కారణముచే


Related Posts